ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచిపోషిస్తోంది

కోటగిరి, బతుకమ్మ: ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని, భారత దేశంలో ప్రజలు కుల, మతాలకు అతీతంగా జీవించడాన్ని ఓర్వలేక భారతీయల్లోని ఐక్యతను దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తోందని కోటగిరి మండల బీజేపీ అధ్యక్షుడు ఏముల నవీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం దాడిని నిరసిస్తూ కోటగిరి మండల కేంద్రంలో హిందూ ముస్లింలు కలిసి పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ.. భారతదేశం అన్ని మతాల ప్రజల ఐక్యమత్యానికి నిదర్శనంగా నిలిచే దేశమని...