28.8 C
Hyderabad
Monday, August 3, 2026

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం

Must read

📰 Generate e-Paper Clip

  • కార్మిక సంఘాల జిల్లా సదస్సులో వక్తల పిలుపు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మే 20న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జిల్లా సదస్సులో వక్తల పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం కార్మిక సంఘాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో సమ్మె సన్నాహాక జిల్లా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి  జే.వెంకటేష్, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శిఎం. శ్రీనివాస్ లు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ, కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్ కోడ్లను  తీసుకురావడం జరిగిందని అన్నారు. వీటికి వ్యతిరేకంగా ఇప్పటికే ఆయా కార్మిక సంఘాలు ఆందోళనలో నిర్వహించినప్పటికీ మోడీ ప్రభుత్వం వాటిని రద్దు చేయలేదన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే మార్చి 18న ఢిల్లీలో సదస్సును నిర్వహించి మే 20న దేశవ్యాప్త సమ్మె కు  పిలుపు ఇవ్వటం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా  రాష్ట్ర సదస్సును కూడా నిర్వహించామని, సమ్మె ఏర్పాట్లలో భాగంగా జిల్లా సదస్సులు జరుగుతున్నాయని వారన్నారు. కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను అమలు చేయాలని చూస్తుందని కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లను అమలు చేసి కార్మిక హక్కులను హరించే ప్రయత్నం చేస్తుందని వారు విమర్శించారు. ఈ సంవత్సరం బడ్జెట్లో కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేశారని సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టి సామాన్యులపై భారాలు   వేయటం, కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడుదారులకు వేలకోట్ల రూపాయల రాయితీలను ప్రకటించి ఆర్థిక అసమానతలను పెరిగే విధంగా చేస్తున్నారని ఫలితంగా నిరుద్యోగం ,దారిద్రం పెరుగుతుందని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించే కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను  కొట్టేందుకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు సమైక్యంగా పోరాడాలని నిర్ణయించాయని కార్మికులకు కనీస వేతనాలు 26,000 అమలు చేయాలని అన్నారు అందులో భాగంగానే మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 12 గంటల పనిని చట్టబద్ధం చేయాలని చూస్తున్నారని , సామాజిక భద్రతా పథకాలకు నిధులు తగ్గిస్తున్నారని, కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ ను కఠిన తరం చేసి సంఘాలు రద్దు చేసేందుకు బరితెగించారని, ఉమ్మడి బేరసారాల హక్కులను తొలగిస్తున్నారని  స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారని వారు విమర్శించారు.  ఈ చర్యలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమైక్యంగా పోరాడినప్పుడే నరేంద్ర మోడీ విధానాలను తిప్పికొట్టగలుగుతామని వారు పిలుపునిచ్చారు.  ఐఎన్ టియుసి జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్, టిఆర్ఎస్కెవి జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి, ఏఐసీసీటియు జిల్లా నాయకులు ఖాజా మొయినుద్దీన్ తదితరులు మాట్లాడారు. ఈ సదస్సుకు ఏఐటియుసీ జిల్లా అధ్యక్షులు నర్సింగ్ రావు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, టీయూసీఐ జిల్లా కార్యదర్శి ఎం.సుధాకర్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు బి.భూమయ్య అధ్యక్షవర్గంగా  వ్యవహరించారు.  ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వై ఓమయ్య సమ్మె తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న,  ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు, వివిధ సంఘాల నాయకులు రమేష్ బాబు, రాజేశ్వర్, శివకుమార్ మల్లేష్, రవి, శ్రీనివాస్, సాయన్న, గంగాధర్ తదితరులతోపాటు వివిధ కార్మిక సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

Let's make the nationwide general strike a success.

More articles

Latest article