. ఓవరాల్ ఉత్తీర్ణత శాతం 59.25
. ఇంటర్ సెకండియర్ బాలికలు 70శాతం.. ఫస్టియర్ బాలికలు 41శాతం
నిజామాబాద్, బతుకమ్మ: ఇంటర్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. రెండో సంవత్సరం విద్యార్థులు 59.25శాతం, ప్రథమ సంవత్సరం విద్యార్థులు 53.37శాతం ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఫస్టియర్, సెకండియర్ లో బాలికలు పైచేయి సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 70శాతం, ఫస్టియర్ లో 64శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు
రెండో సంవత్సరం జనరల్ కోర్సుల్లో మొత్తం విద్యార్థులు 13,945 మంది హాజరుకాగా, వీరిలో 8,117 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 7,657 మంది హాజరుకాగా 5,309 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా బాలురు 6,228 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,808 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే రెండో సంవత్సరం ఒకేషనల్ పరీక్షలకు మొత్తం 2,042 మంది విద్యార్థులు హాజరుకాగా, 1,231 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 814 మంది పరీక్షలకు హాజరుకాగా, 666 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,228 మంది పరీక్షలకు హాజరు కాగా 565 మంది ఉత్తీర్ణులయ్యారు.
ప్రథమ సంవత్సరం జనరల్ కోర్సుల విద్యార్థులు మొత్తం 15,056 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 8,035 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 8,074 మంది హాజరు కాగా 5,191 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,982 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,844 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 2,790 మంది పరీక్షలకు హాజరుకాగా, 1,223 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 1,111 మంది హాజరుకాగా, వీరిలో 756 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,679 మంది హాజరుకాగా 467 మంది ఉత్తీర్ణులయ్యారు.
