29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

‘దుమ్మురేగిన’ మహోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘రైతు మహోత్సవం’ అధికారుల నిర్లక్ష్యం, అనాలోచిత వైఖరికి అద్దం పట్టింది. మహోత్సవం ప్రారంభం రోజునే అధికారుల పనితీరును ఎత్తిచూపింది.

జీజీ కళాశాల మైదానంలో మహోత్సవం ప్రాంగణంలోనే హెలీప్యాడ్ కు ఏర్పాట్లు చేశారు. మంత్రులు వచ్చిన హెలీకాప్టర్ వచ్చి ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడ ఉన్న టెంట్లు, స్వాగత తోరణాలు గాలికి పడిపోయాయి. తీవ్రమైన దుమ్ము రేగడంతో ప్రాంగణంలో ఉన్న వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అయితే కలెక్టరేట్ మైదానంలో హెలీప్యాడ్ ను ఏర్పాటు చేయగా, రైతు మహోత్సవం జరుగుతున్న ప్రాంతంలో హెలీకాప్టర్ ను ల్యాండ్ చేశారని, ఇక్కడ కూడా హెలీప్యాడ్ ఉండడంతో కన్ఫ్యూజ్ అయ్యారని అధికారులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల తీరుపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు.

More articles

Latest article