27 C
Hyderabad

భద్రాచలం రాములవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

Must read

📰 Generate e-Paper Clip

భద్రాచలం, బతుకమ్మ : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం దర్శించుకున్నారు. స్వామివారికి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఆ రాములవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని కవిత పేర్కొన్నారు. ఆమె వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ, చంద్రావతి ఉన్నారు. అంతకు ముందు కవితకు పూర్ణకుంభంతో అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం శ్రీ లక్ష్మి తాయారమ్మ వారి ఆలయంలో పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.


MLC Kavitha visits the Bhadrachalam Ram temple

More articles

Latest article