‘దుమ్మురేగిన’ మహోత్సవం

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘రైతు మహోత్సవం’ అధికారుల నిర్లక్ష్యం, అనాలోచిత వైఖరికి అద్దం పట్టింది. మహోత్సవం ప్రారంభం రోజునే అధికారుల పనితీరును ఎత్తిచూపింది. జీజీ కళాశాల మైదానంలో మహోత్సవం ప్రాంగణంలోనే హెలీప్యాడ్ కు ఏర్పాట్లు చేశారు. మంత్రులు వచ్చిన హెలీకాప్టర్ వచ్చి ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడ ఉన్న టెంట్లు, స్వాగత తోరణాలు గాలికి పడిపోయాయి. తీవ్రమైన దుమ్ము రేగడంతో ప్రాంగణంలో ఉన్న వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కలెక్టరేట్ మైదానంలో హెలీప్యాడ్...