29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

సుప్రీం తీర్పు హర్షనీయం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : జర్నలిస్టుల విషయంలో సుప్రీం తీర్పు హర్షనీయమని, పిట్లం మండల ప్రెస్ క్లబ్ పేర్కొంది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, జర్నలిస్టుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఎంతో శుభదాయకమని, ఈ తీర్పుతో సమాజంలో జరుగుతున్న వాస్తవ విషయాలు, ప్రజలకు తెలపడానికి ఎంతో దోహదపడుతుందని, దేశంలోని జర్నలిస్టులను బెదిరించిన, తిట్టిన, కొట్టిన 50 వేల జరిమానా తో పాటు, పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జరుగుతుందని, సుప్రీంకోర్టు తీర్పునివ్వడం పట్ల పలు జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి .ఈ తీర్పుతో జర్నలిస్టులు నిర్భయంగా వార్తలను రాసి ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలప దానికి ఎంతో దోహదపడుతుందని, తద్వారా సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతుందని వారు పేర్కొన్నారు. సుప్రీం తీర్పుతో నైనా జర్నలిస్టులపై బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే  అరాచక శక్తులకు, ఇది ఒక గుణపాఠం లాంటిదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నీలకంటి లోక శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆత్మకూరి భూమయ్య, కార్యదర్శి వడ్ల రవి, సహాయ కార్యదర్శి సాయి బాబా, కోశాధికారి హన్ను, సలహాదారులు మహబూబ్   పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.

More articles

Latest article