29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉపాధి హామీ కూలీలకు వసతులు కరువు

Must read

📰 Generate e-Paper Clip

  •  పని ప్రదేశంలో కానరాని టెంట్లు, త్రాగు నీరు
  • అందుబాటులో లేని మెడికల్ కిట్లు
  • అధికారుల పర్యవేక్షణ కరువు

 

రుద్రూర్, బతుకమ్మ : పల్లెల్లో కూలీల వలసల ను నివారించడంతో పాటు వారికి పని కల్పించి చేసి న పనికి తగినట్లుగా వేతనాలు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలల్లో ఉపాధి హామీ పనులకు వెళ్తున్న ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశంలో సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి హామీ కూలీలకు సరైన వసతులు లేకపోవడంతో మండుటెండలోనే పనులు నిర్వహిస్తున్నారు. వసతులు కల్పించడంలో అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉపాధి హామీ కూలీలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి పని ప్రదేశానికి అధికారుల పర్యవేక్షణ కరువైందని ఉపాధి హామీ కూలీలు వాపోతున్నారు. ఉపాధి హామీ పనులు ప్రారంభంలో దశల వారీగా కూలీలకు గడ్డపారలు, మెడికల్‌ కిట్లు, టెంట్లు(గుడారాలు), తాగు నీరు లాంటి వసతులను కల్పించినప్పటికీ రాను రాను వారికి ఎలాంటి సదుపాయాలను కల్పించడం లేదు. ఇది వరకు కూలీలు సొంతంగా గడ్డపార సమకూర్చుకుంటే రోజుకు రూ. 10, తాగు నీటి కోసం రూ.5 అందజేసే వారు. కనీసం ఇప్పుడు పని ప్రదేశంలో కనీస వసతులు లేకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పనులు చేసే వారే తక్కువగా ఉన్నారని, పనులు చేయకుండా డబ్బులు తీసుకునే వారు ఎక్కువగా ఉన్నారన్నారని ఉపాధి హామీ కూలీలు మండిపడుతున్నారు. ఇటీవల ఎండలు తీవ్రంగా ఉండడంతో కూలీలు అస్వస్థతకు గురవుతున్నారు. వేసవిలో మార్చి నుంచి జూన్ వరకు కూలీలకు వడదెబ్బ తగలకుండా నీడ కోసం టెంట్లు వేసి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. అలసటగా ఉంటే పొదలు, చెట్ల చాటున సేద తీర్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కనీసం నీటిని సరఫరా చేయడానికి ఒక మేట్‌ను నియమిస్తే కూలీలకు సౌకర్యంగా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలకు వసతులు లేకపోవడంతో ఎండలోనే సేద తీరుతున్నారు.  అదేవిధంగా రుద్రూర్ గ్రామంలో చెరువు కట్ట వద్ద ఉపాది పనులు నిర్వహిస్తున్న కూలీలకు సోమవారం నుండి శుక్రవారం వరకే హాజరు తీసుకుంటున్నాడని, శనివారం రోజున మాత్రం ఫీల్డ్ అసిస్టెంట్ హాజరు తీసుకోవడం లేదని, పని చేసినా కూడా హాజరు  తీసుకోవడం లేదని ఉపాధి హామీ కూలీలు ఆరోపిస్తున్నారు. ఇప్పటి కైనా అధికారులు వెంటనే స్పందించి ఉపాధి హామీ కూలీలకు సరైన వసతులు కల్పించాలని ఉపాధి హామీ కూలీలు కోరారు.

Lack of facilities for employment guarantee workers

More articles

Latest article