. . . ఇద్ధరు బాలుర దుర్మరణం
. . . ఓక్కరికి తీవ్రగాయాలు
ఆర్మూర్, బతుకమ్మ :
జాతీయ రహదారి 44 పై అదివారం లారీ , బైక్ ను డికోట్టిన సంఘటనలో ఇద్ధరు బాలురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బైక్ ను నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అదివారం మద్యహ్నం ఆర్మూర్ పట్టణంలోని పేర్కిట్ వద్ధ జరిగింది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని అశోక్ నగర్ కు చెందిన బంజా విశ్వనాథ్ తన బైక్ పై కోడుకు బంజా ఓంకార్ (13), ఎండ్రికాయల భాను ప్రసాద్ (13) లతో వెలుతుండగా వెనుకనుంచి వచ్చిన లారీ డికోట్టింది. ఈ ప్రమాధంలో ఓంకార్, బాను ప్రసాద్ లు అక్కడే మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాద ఘటనలో బైకును నడుపుతున్న బాంజ విశ్వనాథ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాద సంఘటన విషయాన్ని తెలుసుకొని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ఎస్సై మహేష్ లు పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు బాలురు డేడ్ బాడిలను ఆర్మూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో గల మార్చురీ గదికి తరలించి, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విశ్వనాధ్ ను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 44 నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరగడంతో నిలిచిపోయిన ట్రాఫిక్ ను ఆర్మూర్ ఎస్ హెచ్ వో సత్యనారాయణ గౌడ్ పోలీస్ సిబ్బందితో కలిసి క్లియర్ చేయించారు.

