- ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భాషా పండితుల 30 సంవత్సరాల కోరిక నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేరిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (Rupp -TG) ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వ పండితుల కృతజ్ఞత సభ నిర్వహిమచారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. అనంతరం షబ్బీర్ అలీ

మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాం అని తెలిపారు. గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన ఎంతో కష్టపడి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చామని, రాష్ట్రంలో నేటి వరకు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసామని తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే బాధ్యత ఉపాధ్యాయులదే అని వారికి నాయకుల సహకారం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి సహకారం అందించి విద్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ విషయం ప్రజల్లో తీసుకెళ్లాలి అన్నారు.

