27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆరు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 6 ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేసినట్లు స్థానిక ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గోలి లింగాల్ గ్రామానికి చెందిన కోడే గంగారాం, తొంట సిద్ధి రాములు, పిట్ల సత్యనారాయణ, పుట్ల సంతోష్, కంచనపల్లి లింగాగౌడ్, పుట్ల కిష్టయ్య అనే వ్యక్తులు గురువారం ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గోలి లింగాల్ గ్రామ శివారులోని మంజీరా నది నుండి అక్రమంగా ఇసుకను తరలించడానికి ప్రయత్నిస్తుండగా ఎస్సై మల్లారెడ్డి పోలీస్ సిబ్బందితో వెళ్లి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా మంజీరా నది శివారు ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తే ట్రాక్టర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

More articles

Latest article