ఆరు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 6 ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేసినట్లు స్థానిక ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గోలి లింగాల్ గ్రామానికి చెందిన కోడే గంగారాం, తొంట సిద్ధి రాములు, పిట్ల సత్యనారాయణ, పుట్ల సంతోష్, కంచనపల్లి లింగాగౌడ్, పుట్ల కిష్టయ్య అనే వ్యక్తులు గురువారం ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గోలి లింగాల్ గ్రామ శివారులోని మంజీరా నది నుండి అక్రమంగా ఇసుకను తరలించడానికి...