26.2 C
Hyderabad
Monday, August 3, 2026

నిజామాబాద్ లో 21 నుండి కిసాన్ మేళా

Must read

📰 Generate e-Paper Clip

  • రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 21 నుండి 23 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ తెలిపారు. స్థానిక గిర్రాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో జరిగే ఈ కిసాన్ మేళాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ కిసాన్ మేళాలో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల రైతులు, వారి ఉత్పత్తులు ప్రదర్శనలో పెట్టనున్నట్లు తెలిపారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు సైతం కిసాన్ మేళాలో ఉండనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు సంబందించిన ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కిసాన్ మేళాను విజయవంతం చేయాలన్నారు.

More articles

Latest article