మెదక్, బతుకమ్మ : ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త ఉండాలని నిజాంపేట ఎస్సై బండి రాజేశ్ అన్నారు. శుక్రవారం నిజాంపేట ఆరోగ్యమే మహాభాగ్యం టీం సభ్యులు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎస్సై రాజేశ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు ఎస్సైని సన్మానించారు. ఆరోగ్యమే మహాభాగ్యం టీం సభ్యులు ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసుకోవడంపై ఎస్సై హర్షం వ్యక్తం చేశారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై సూచించారు. ఈకార్యక్రమంలో ఆరోగ్యమే మహాభాగ్యం టీం సభ్యులు ఉన్నారు.
