27.5 C
Hyderabad
Friday, July 31, 2026

గ్రూప్-1 మళ్లీ నిర్వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత కొరవడింది

. యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం

. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ

హైదరాబాద్, బతుకమ్మ: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆమె బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతూ వారిని అగాధంలోకి నెట్టివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్-1 నిర్వహణ తీరుపై, ఫలితాలపై అభ్యర్థులు అనేక సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు.

21,075 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరైనట్లు టీజీపీఎస్సీ ప్రకటించగా, ఫలితాలు ప్రకటించేనాటికి ఆ సంఖ్య 21,085కు పెరిగిందని, ఆ పది మంది అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగిందని, బయోమెట్రిక్ హాజరువిధానం అమలు చేసినా ఈ పరిస్థితి ఏమిటని కవిత ప్రశ్నించారు.

దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్లతో వ్యాల్యుయేషన్‌ చేయిస్తామని తొలుత టీజీపీఎస్సీ ప్రకటించి, రిటైర్డ్ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించడంపై అభ్యర్థుల్లో అనుమనాలున్నాయి. కేవలం రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్‌ పరీక్షలకు హాజరైన రెండు కోచింగ్‌ సెంటర్లకు చెందిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరిగి ఉందని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు.

ఆ రెండు కేంద్రాల్లో పరీక్షలకు హాజరైన 71 మంది ఉద్యోగాలకు ఎంపికైనది నిజమేనని టీజీపీఎస్సీ కూడా అంగీకరించిందని అన్నారు. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్దమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసిందని పేర్కొన్నారు.

More articles

Latest article