ఇసుకరెడ్డి తగిన మూల్యం చెల్లించక తప్పదు
తాజా మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్
భీమ్ గల్, బతుకమ్మ : ఇచ్చిన హామీలను అడిగితే పోలీసోళ్ల తో విచక్షణ రహితంగా కొట్టించే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నది ప్రజా పాలన కాదని రాక్షస పాలన అని తాజా మాజీ ఎం. పీ. పీ ఆర్మూర్ మహేష్ అన్నారు. ఇంచార్జ్ మంత్రి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమం లో ఇస్తానన్న తులం బంగారం గురించి బీయర్ ఎస్ నాయకులు ప్ల కార్డులు పట్టుకొని శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు జరిపిన లాఠీ ఛార్జ్ కు నిరసంగా గురువారం పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంచార్జ్ మంత్రి ప్రోగ్రాం ముగించుకొని వెళ్లిన అనంతరం బాల్కొండ కానిస్టేన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ సునీల్ రెడ్డి అలియాస్ ఇసుక రెడ్డి భీమ్ గల్ సీ ఐ ని పురామయించి కావాలని బీ ఆర్ ఎస్ నాయకులపై లాఠీ ఛార్జ్ చేయించడని అన్నారు. గత ఎన్నికల్లో భీమ్ గల్, వేల్పూర్ మండల ప్రజలు ఇసుక రెడ్డి కి ఓట్లు వెయ్యలేదని దాంతో ఓడిపోయానన్న అక్కసుతో లాఠీ ఛార్జ్ చేయించి కొట్టించడని ఆరోపించారు. ప్రజాస్వామ్యం లో ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చకపోతే నిరసన తెలపడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. మీరు లాఠీ ఛార్జ్ లు చేసి, పోలీస్ కేసులు చేస్తే బెదిరేది లేదని ఇకనుండి ఇచ్చిన హామీలు తీర్చే వరకు ఖచ్చితంగా బీయర్ ఎస్ పార్టీ కార్యకర్తలు గా ప్రశ్నిస్తామని, నిరసన తెలుపతమని, గ్రామాల్లోకి కాంగ్రెస్ నాయకులను తిరుగా నియ్యమని ఆయన హెచ్చరించారు. పార్టీ అధికారంలో ఉందని అధికారులతో అక్రమంగా కేసులు, లాఠీ ఛార్జ్ లు చేసి బెదిరిస్తానని ఇసుక రెడ్డి అనుకుంటున్నాడని, నివ్వు ఎన్ని కేసులు చెపించిన, నివ్వు ఎన్ని లాఠీ ఛార్జ్ చేయించిన ప్రజల హామీల అమలుకు పోరాటం చేస్తామని, ఈ విషయంలో ఇసుక రెడ్డి మూల్యం చెల్లించక తప్పదని మహేష్ అన్నారు. మండల పార్టీ ప్రెసిడెంట్ దొంకంటి నర్సయ్య, తాజా మాజీ జడ్పిటీసీ చౌట్ పల్లి రవిలు మాట్లాడుతూ పదేండ్ల బీయర్ఎస్ పాలనలో మన కానిస్టేన్సీలో ఎక్కడైనా ఇలాంటి అనైతిక దాడు లు జరిగాయా అని ప్రశ్నించారు.చట్ట విరుద్దంగా కాంగ్రెస్ నాయకులకు పోలీసులు తొత్తులుగా, పార్టీ కార్యకర్తల్ల వ్యవహరించిన వయసు భేదం ఏమిలేకుండా విచక్షణ రహితంగా కొట్టడం అమానుషమని వారు తీవ్రంగా ఖండించారు. పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబందించిన వీడియో క్లిప్ లు మావద్ద ఉన్నాయని, వాటి ఆధారంగా చట్టపరంగా చర్యలు చెప్పాడుతామని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తళ్లగా వ్యవహరించిన పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది భవిష్యత్ లో పరియావాసనం ను అనుభవిస్తారని తెలిపారు. ఏది ఏమైనా ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చే వరకు, ప్రజా సమస్యలు తీరేవరకు ప్రజల తరపున నిరసన లు తెలుపుతామని, లాఠీ ఛార్జ్ లు, అక్రమ కేసులకు బయపడేదే లేదని వారు స్పష్టం చేశారు.ఈ ప్రెస్ మీట్ లో బీయర్ ఎస్ నాయకులు తాజా మాజీ జడ్పి కోపషన్ మెంబర్ మోహిజ్, నాయకులు మాణిక్యాల శ్రీనివాస్,భీమ్ గల్ సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
