27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సమగ్ర విచారణ చేపట్టాలి 

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ :  రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని హాస్టల్లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య పైన సమగ్ర విచారణ చేపట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం  ఆధ్వర్యంలో నిజాంబాద్ నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్లో పత్రికా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థిని తన హాస్టల్లోని బాత్రూంలో ఉరి వేసుకొని కనబడడం బాధాకరమన్నారు. హాస్టల్ వార్డెన్,ప్రిన్సిపల్ ను, కళాశాల అధికారులను విచారణ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తెలిపారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PDSU నాయకులు నసిర్, సృజన్, శివ కుమార్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article