. రూ.50వేల నుంచి రూ.4లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ
నిజామాబాద్, బతుకమ్మ: వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఇచ్చే ఎక్సగ్రేషియాను రూ.50వేల నుంచి రూ.4లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తీవ్రమైన ఎండలువడగాలులువడదెబ్బ తదితర కారణాలతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వడదెబ్బ కారణంగా ఎవరైనా మరణిస్తే గతంలో రూ. 50 వేలు చెల్లించేవారు. రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్డీఆర్ఎఫ్) కింద ప్రస్తుతం ఎక్స్ గ్రేషియాను 50 వేల నుంచి 4 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం (జీవో ఎంఎస్ నంబర్ 5తేదీ 15-04-2025) ఉత్తర్వులు జారీ చేసింది.
వేడి గాలులు వీచే అవకాశం
ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణంతో పోలిస్తే ఎక్కువ వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్తె, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులోని ఉత్తర ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
అప్రమత్తంగా ఉండాలి
వడగాలుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలనిస్థానిక అధికారులు జారీ చేసిన ఆరోగ్య సలహాలను పాటించాలని ప్రభుత్వం కోరింది. వడగాలులు ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సంబంధిత శాఖల ద్వారా కార్యక్రమాలను చేపట్టింది.
వడదెబ్బ మృతి పరిహారం పెంపు
