వడదెబ్బ మృతి పరిహారం పెంపు
. రూ.50వేల నుంచి రూ.4లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ నిజామాబాద్, బతుకమ్మ: వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఇచ్చే ఎక్సగ్రేషియాను రూ.50వేల నుంచి రూ.4లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తీవ్రమైన ఎండలువడగాలులువడదెబ్బ తదితర కారణాలతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వడదెబ్బ కారణంగా ఎవరైనా మరణిస్తే గతంలో రూ. 50 వేలు చెల్లించేవారు. రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్డీఆర్ఎఫ్) కింద ప్రస్తుతం ఎక్స్...