- కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమురి వెంకట్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పార్లమెంటు సాక్షిగా అంబెడ్కర్ ని అవమానించిన వ్యక్తి అమిత్ షా అని ఎమ్మెల్సీ బలమురి వెంకట్ అన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం కాలూర్ గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ జై భీం, జై బాబు, జై సంవిధన్ కార్యక్రమంలో ఎమ్మెల్సి బలమురి వెంకట్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో సన్న బియ్యం భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ మాట్లడారు. అమిత్ షా ప్రసంగాన్ని అడ్డుకొని దద్దమ్మలు రాష్ట్ర బిజెపి ఎంపీలు అని అన్నారు. బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మోసిన వ్యక్తి అని తెలిపారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, సంజయ్ లకు బుద్ధి లేదని ఎంపీ అరవింద్ కు రాజ్యాంగం మీద అవగాహన లేదని అన్నారు. బిజెపి నేతలకు అంబేడ్కర్ విగ్రహాలను శుద్ధి చేసే నైతిక హక్కు లేదన్నారు. అమిత్ తో క్షమాపణ చెప్పించన తర్వాతే బిజెపి నేతలు అంబెడ్కర్ గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. దేశంలో అంబెడ్కర్ ఆశయాలను మోస్తున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, నుడా చైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
