నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీజీఓ ఆధ్వర్యంలో సోమవారం డా.బీ.ఆర్.అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పూలాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, జిల్లా కార్యదర్శి సంగం అమృత్ కుమార్,కోశాధికారి దేవి సింగ్, వైస్ ప్రెసిడెంట్ రాములు, కార్యవర్గ సభ్యులు వినయ్ కుమార్, చందర్, నాగరాజు, శివరామకృష్ణ, ఉద్యోగులు తదితరులు హాజరయ్యారు.
