30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రజా సమస్యల పై పార్టీలకు అతీతంగా కృషి చెయ్యాలి

Must read

📰 Generate e-Paper Clip

  • సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్

 

సిరికొండ, బతుకమ్మ : గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే స్థానిక నాయకులు పార్టీలకు అతీతంగా కృషి చేయాలని సీపీఐ(ఎం. ఎల్) ప్రజాపంథా ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్ కోరారు. ఆదివారం మండలంలోని రావుట్ల గ్రామంలో సీపీఐ(ఎం. ఎల్)గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రావుట్ల గ్రామంలో అన్ని పక్షాల వారు కలిసి అభివృద్ధికి పాటుపడే మంచి సాంప్రదాయం ఉందని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేసే నాయకులే ప్రజామోదం పండుతారని అన్నారు. గ్రామాల్లోని ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఐక్యంగా నిలబడి పని చేయాలని కోరారు.ఈ  కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ మండల నాయకులు ఈ. రమేష్, ఈ.జమున,ఎం.శ్యామల,  ఎస్. కే.తస్లిం, బట్టు. మంజుల, టి.చిన్నరాజన్న, బట్టు. సర్పంచ్, భాశెట్టి. గంగన్న, రావుట్ల  సర్పంచ్ తోట. రాజన్న, విడిసి చైర్మన్ కోడిగేల. నందు, కాంగ్రెస్ నాయకులు సీచ్. రమేష్ గౌడ్, గొల్ల. శ్రీనివాస్, వార్డు మెంబెర్, కాంగ్రెస్ నాయకులు ఆర్. సామెల్, భాశెట్టి. దాస్, డాక్టర్. గోపాల్ గౌడ్, డాక్టర్. రమేష్, ప్యాట్ల. గంగాదాస్, బట్టు. రాజేందర్, బియ్యకర్. మోతిలాల్, కుమ్మరి. గంగు, కారోబార్ రాజబాపు, ఇట్టాంపేట. రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article