30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

అంబేద్కర్ విగ్రహం శుద్ధి

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని బిజెపి మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ ఆధ్వర్యంలో నీటితో శుద్ధిపరిచారు.రేపు అంబేద్కర్ జయంతి ఉన్నందున పెద్ద ఎత్తున మండల కేంద్రంలోనీ అంబేద్కర్ జయంతిని జరిపేందుకు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు చెందిన యువకులు, నాయకులు,తరలిరావాలని కోరారు మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల గనుగుణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నిర్వహించడం జరుగుతుందని అన్నారు కులమత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు భారీ సంఖ్యలో హాజరై అంబేద్కర్ జయంతి ప్రోగ్రాం విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయుడు రాజన్న,మహేందర్ రాజు,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article