30.9 C
Hyderabad
Monday, August 3, 2026

పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు ఉచిత శిక్షణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలోని మహిళా  విద్యార్థులకు  పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిభిరాన్ని నిర్వహించనున్నట్లు పోలీసు కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. విద్యార్థినిలు తమను తాము రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ (ఆత్మరక్షణకు ), భవిష్యత్తు నిర్మించుకోవడానికి మోటివేషన్ ( ప్రేరణ) సమాజంలో మహిళలపై జరిగే నేరాల పట్ల పోలీస్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ఏప్రిల్ 25 నుండి మే 2వ తేది వరకు నిర్వహించనున్నామన్నారు. నిజామాబాద్ లోని ఆర్మూర్ రోడ్డులో గల ఆర్ బివిఆర్ఆర్ స్కూల్ లో  ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడం జరగుతుందన్నారు. 9,10, ఇంటర్మీడియట్ విధ్యార్థినులకు ఈ శిక్షణ శిబిరానికి అర్హులన్నారు. వీరికి ఉదయం అల్పాహారం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు తమ పేర్లను ఈ నెల 13 నుంచి  24వ తేది వరకు ఫోన్ నెంబర్ : 90009 94312కు సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

More articles

Latest article