23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : గత కొంత కాలంగా జాతీయ రహదారిపై జరుగుతున్న దారి దోపిడీలకు పాల్పడ్డ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు తెలిపిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం వివరాలను వెల్లడించారు. ఈ ముఠాలో 11 మంది దొంగలు ఉన్నట్టు తెలిపారు. ఇందులో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్టు పేర్కొన్నారు.పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు టీమ్ లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిందితుల వద్ద నుండి 6 మొబైల్ ఫోన్లు, 2 ల్యాబ్ ట్యాబ్ లు, 4 కత్తులు, 2 రాళ్ళు, 2 టార్చ్ బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. నిందితులు గత ఐదు ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నట్టు వెల్లడించారు. మెదక్ జిల్లా కేంద్రంగా డేరాలు ఏర్పాటు చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్న పేర్కొన్నారు. పగలు సమయంలో చిరు వ్యాపారాలు చేస్తున్నట్టు నటిస్తూ రాత్రి సమయంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహన దారులే లక్ష్యంగా చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.

More articles

Latest article