- బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహాత్మా జ్యోతిబా పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతి భా పూలే 199 వ జయంతి సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిసి ఉపాధ్యాయ జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ జ్యోతిభా పూలే ప్రముఖ సంఘ సంస్కర్త, బహుజనుల వెనుకబాటుకు విద్య లేకపోవడమే అని గ్రహించి 180 సంవత్సరాల క్రితమే మొట్టమొదట అనేక పాఠశాలలు స్థాపించి విద్య ను అందించిన ఘనత జ్యోతిభా పూలే దంపతులకు దక్కుతుందని అన్నారు. ఆ దంపతులకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు ను ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసిటియు జిల్లా అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, కార్యనిర్వాహక అధ్యక్షులు కొట్టాల రామకృష్ణ, ఉపాధ్యక్షులు రమేష్, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
