24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన బోండ్ల నర్సింలు(35)కు సవిత తో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కొడుకులు సంతానం. నర్సింలు  గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. బుధవారం ఉదయం నర్సింలు భార్య సవిత తమ గ్రామానికి చెందిన వారి వివాహం ఎల్లారెడ్డిలో ఉండడంతో తన పిల్లలని తీసుకొని వివాహానికి వెళ్ళింది. సవిత తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చి చూడగా నర్సింలు తన ఇంట్లో దూలానికి చీరతో ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సింలు  భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్లారెడ్డి ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు.

More articles

Latest article