27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ధరల నియంత్రణలో కేంద్రం వైఫల్యం

Must read

📰 Generate e-Paper Clip

  • చమురు ధరలు పెంచి సామాన్యులను నిలువుదోపిడీ చేస్తున్న ప్రధాని మోడీ
  • సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) జిల్లా నాయకురాలు పీ. రమ

 

ధర్పల్లి, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్, పిట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, వీటి ధరలను  పెంచి  పేదల పొట్ట కొడుతున్నదని  సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) జిల్లా నాయకురాలు పీ.రమ లు తీవ్రంగా విమర్శించారు. గురువారం సీపీఐ( ఎంఎల్) మాస్ లైన్, ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ ) సిరికొండ, ధర్పల్లి మండలాల కమిటీలు సంయుక్తంగా  కేంద్రం ప్రభుత్వం పెంచిన పిట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలకు నిరసనగా ధర్పల్లి మండల కేంద్రంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ధరలను పెంచి ప్రధాని మోడీ దేశంలోని సామాన్య ప్రజలను నట్టేట ముంచాడన్నారు.  మోడీ 11 ఏళ్లుగా సంపన్నులైనా కార్పొరేట్ల కొమ్ముగాస్తు దేశ ప్రజలు ముఖ్యంగా పేదలపై  ధరలు, పన్నులు పెంచి  వాళ్ల వెన్ను వీరుస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు-కృడాయిల్ రేట్లు తగ్గిన కూడా మోడీ ప్రభుత్వం మన దేశంలో పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ  పెట్రోల్ వంట గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటు అన్నారు. మోడీ మతం మత్తులో దేశ ప్రజలను ముంచి తుగ్లక్ ను మించిన మతి లేని పరిపాలన చేస్తున్నాడు అన్నారు. ప్రజల మస్థికాన్ని పక్కదోవపట్టిస్తు దేశాన్ని సర్వనాశనం ఆరోపించారు.ధరలు, నిరుద్యోగం, ఆకలి, పేదరికం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలను పట్టించుకోకుండా, పరిష్కరించకుండ “మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు” ప్రజలపై అన్ని రంగాల్లో మరింత భారం వేయడం శోచనీయం అన్నారు.     కేంద్రం పేదల పొట్టకొట్టడం తప్ప పేదలను ఆదుకున్నది లేదు అన్నారు. కోటిశ్వరులకు మేలు చేసేందుకే చమురు – వంట గ్యాస్ లను పెంచి తమ నైజం చాటుకున్నారు అన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం. ఎల్.)మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, మండల నాయకులు ఈ. రమేష్, పీ.వో. డబ్ల్యూ  సిరికొండ మండల ప్రధాన కార్యదర్శి ఆర్. పుష్పలత,  నాయకులు స్వరూప, లక్ష్మి, రజిత, సులోచన, వీరు, సభినాభేగం, సమీర భేగం, జమున, లక్ష్మి, రూప తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article