బతుకమ్మ, బోధన్: మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ మాతృమూర్తి శగుప్త గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం వేకువజామున హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కాగా కొద్దిసేపటి క్రితమే వారి పార్థివ దేహాన్ని వారి స్వస్థలం బోధన్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ స్వగృహానికి తీసుకురావడం జరిగింది. వీరి అంత్యక్రియలు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి శక్కర్ నగర్ లోని జామ మసీదులో వీరి అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి.
