బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో గల రాజరాజేశ్వర స్వామి దేవాలయం కు సిసి రోడ్డు నిర్మాణం పనుల కోసం గురువారం శంకుస్థాపన చేయడం జరిగింది. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి చొరవతో ధర్మోరా గ్రామానికి రూ. 10,00,000 మంజురు చేయడం జరిగింది. కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాల రాములు, గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు మిట్టపల్లి దేవేందర్, అనిల్, మహేష్, రాజు, పిల్లి మహేష్, శ్యామ్ గౌడ్, రఘు గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దమనుషులు తదితరులు పాల్గొన్నారు.
