23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యుదాఘాతంతో గేదె మృతి

Must read

📰 Generate e-Paper Clip

  • విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం

 

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలం చిక్కడ్ పల్లి గ్రామంలో ప్రమాదావశాత్తు విద్యుత్ షాక్ తగిలి పాడి గేదె మృతి చెందింది. చిక్కడపల్లి క్యాంపు కు చెందిన కృష్ణంరాజు పాడి గేదెలపై జీవనాన్ని సాగిస్తున్నాడు. మేత కోసం గేదెలను తీసుకెళ్లగా చిక్కడపల్లి గ్రామ శివారులోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద మేత. మేస్తున్న గేదెకు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఘటన స్థలంలో గేదె మృతి చెందిందని రైతు బోరున విలపించాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయకపోవడంతోనే తన గేదె విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్లు పాడి రైతు ఆరోపించారు. సుమారు లక్ష 20వేలు రూపాయల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

More articles

Latest article