25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: తొర్తి గ్రామంలో గ్రామ సంఘం ద్వారా కొనుగోలు కేంద్రాన్ని కమ్మర్ పల్లి ఏఎంసి  చైర్మన్ పాలెపు  నరసయ్య కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.  ఈ సందర్భంగా చైర్మన్ నరసయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి, గ్రామీణ శాఖ మంత్రి సీతక్క, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అనేక పథకాలు అందజేస్తున్నారని, అన్నారు. అలాగే మహిళల కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ఉచిత కరెంటు ఉచిత గ్యాస్ వీటితోపాటు మహిళా సంఘాలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరు చేస్తున్నదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కి మరియు మంత్రి సీతక్కకి మన ఏర్గట్ల మండలం తరపున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. అదేవిధంగా మరి ఈ కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం నమ్మకంతో మహిళలకు ఇచ్చినందున మహిళలు రైతుల యొక్క వడ్లు సకాలంలో కొనుగోలు చేసి డబ్బులు తొందరగా రైతుల ఖాతాలో జమ అయ్యే విధంగా మహిళలు చూడాలని ఈ సందర్భంగా గ్రామ మహిళ సంఘాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ కోరి పెళ్లి లింగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ శివకుమార్, ఎమ్మార్వో విష్ణువర్ధన్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏపీఎం శ్యాం, ఎంపీ ఓ శివ చరణ్, ఎంఏఓ వైష్ణవ్, సిసి నవీన్, మండల సమాఖ్య ఓబి, వసంత,దేవయి,విఓఏ రష్మిత, గ్రామ సంఘం అధ్యక్షురాలు లక్ష్మి,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మెరుగు మహేష్, భూమేష్,డాక్టర్ శేఖర్, మోహన్,సుమన్,కుండ చిన్న సాయన్న డ్వాక్రా మహిళలు రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article