29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా పీఆర్‌టీయూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పీఆర్‌టీయూ తెలంగాణ సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం నగరంలోని వర్ని చౌరస్తా వద్ద గల సంఘ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్‌టీయూ తెలంగాణ జెండాను జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృపాల్ సింగ్ మాట్లాడుతూ పీఆర్‌టీయూ తెలంగాణ సంఘం 2011 ఏప్రిల్ 9న ఆవిర్భవించి, రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తుందని అన్నారు. హక్కుల పరిరక్షణ, విధుల నిర్వహణ, సామాజిక న్యాయం అనే సిద్ధాంతాలతో ముందుకు సాగుతోందని తెలిపారు.  పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని, 51% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేకు అనుగుణంగా పారితోషికం చెల్లించాలని, ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ విడుదల చేయాలని, అలాగే ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె.రవీందర్, నాగేశ్వరరావు, గంగాధర్, జావిద్, రాము, దేవానంద్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

PRTU Telangana Formation Day celebrations in grand style

More articles

Latest article