ఘనంగా పీఆర్‌టీయూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పీఆర్‌టీయూ తెలంగాణ సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం నగరంలోని వర్ని చౌరస్తా వద్ద గల సంఘ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్‌టీయూ తెలంగాణ జెండాను జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృపాల్ సింగ్ మాట్లాడుతూ పీఆర్‌టీయూ తెలంగాణ సంఘం 2011 ఏప్రిల్ 9న ఆవిర్భవించి, రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తుందని అన్నారు. హక్కుల పరిరక్షణ, విధుల నిర్వహణ, సామాజిక న్యాయం అనే...