28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కత్తితో పొడుచుకొని వ్యక్తి ఆత్మహత్యయత్నం

Must read

📰 Generate e-Paper Clip

చికిత్స పొందుతూ మృతి

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : జిల్లా కేంద్రంలో కత్తులతో పొడిచి చంపడమే కాకుండా, బెదిరించడమే జరగడంతోపాటు, కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకునే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లా కేంద్రంలోని అహ్మదుపుర కాలనీకి చెందిన షేక్ రఫత్ (45) తన ఇంటి వద్దనే మామిడి కాయలు కోసే కత్తితో పొడుచుకొని మంగళవారం ఆత్మహత్యయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. లేబర్ పని చేసే రఫత్ గతంలో పలు వివాదాల్లో తలదూర్చినట్టు సమాచారం. ఈమేరకు కుటుంబ సభ్యులు రెండో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

More articles

Latest article