27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బీజేపీ ఎమ్మెల్సీలను సన్మానించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీజేపీ ఎమ్మెల్సీలను బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి సన్మానించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీలు చిన్నమలై అంజి రెడ్డి, మల్క కొమురయ్య లను  సన్మానించారు. ఈ సందర్భంగా దినేష్ పటేల్ మాట్లాడుతూ ఈ విజయం బీజేపీ కార్యకర్తల కృషి ఫలితమన్నారు. గెలిచిన ఎమ్మెల్సీలు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యతను గుర్తుంచుకొని, పార్టీ సిద్ధాంతాలకు నిబద్ధంగా సేవ చేయాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు చొరవ తీసుకోవాలన్నారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మనందరం ముందుకు సాగాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ పాల్గొన్నారు.

More articles

Latest article