బీజేపీ ఎమ్మెల్సీలను సన్మానించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీజేపీ ఎమ్మెల్సీలను బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి సన్మానించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీలు చిన్నమలై అంజి రెడ్డి, మల్క కొమురయ్య లను సన్మానించారు. ఈ సందర్భంగా దినేష్ పటేల్ మాట్లాడుతూ ఈ విజయం బీజేపీ కార్యకర్తల కృషి ఫలితమన్నారు. గెలిచిన ఎమ్మెల్సీలు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యతను గుర్తుంచుకొని, పార్టీ సిద్ధాంతాలకు నిబద్ధంగా సేవ చేయాలని...