27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

హెల్తీ గా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  హెల్తీ గా ఉండాలంటే తప్పనిసరిగా కొన్నిరకాల జాగ్రత్తలు పాటించాలని మెడికవర్ వైద్య బృందం తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుతారు.హెల్తీ గా ఉండాలంటే తప్పనిసరిగా కొన్నిరకాల జాగ్రత్తలు పాటించాలి. ఆధునిక జీవన శైలిలో సౌకర్యాలతో పాటు సమస్యలను కూడా పెంచుకుంటున్నాం.  ఆహారపు అలవాట్లు, కూర్చున్న చోటే అన్ని పనులు జరగడం, చాలీ చాలని నిద్ర వీటన్నింటి కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నాం. ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ (ఏప్రిల్​ 7) సందర్భంగా మన జీవన శైలిలో మార్పులు? వాటి వల్ల వస్తున్న సమస్యలు, నివారణ చర్యలేంటో తెలుసుకుందాం. తెల్లవారుజామునే నిద్రలేవడం, రాత్రి త్వరగా పడుకోవడం, ప్రకృతిని ఆస్వాదిస్తూ రోజంతా ఒళ్లు వంచి పనులు చేసుకోవటం. అంతే కాకుండా సహజసిద్ధంగా పండే కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలను తినడం. ఆరుబయట గాలిని పీలుస్తుండటం, స్వచ్ఛమైన నీటిని తాగుతూ ప్రశాంతంగా బతకడం. ఇది ఒకప్పటి జీవన శైలి. కానీ ఇప్పుడలా కాదు, కూర్చున్న చోటే అన్ని పనులు అవుతున్నాయి. సహజ సిద్ధమైన ఆహారాలు, సంప్రదాయక వంటలు పూర్తిగా కనుమురుగు అయిపోయాయి. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్​కు నేటి సమాజం బాగా అలవాటు పడిపోతుంది.అంతే కాదు సమయానికి తినడం దాదాపు మర్చిపోయామనే చెప్పొచ్చు. వేళా పాళా అనేది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినేస్తున్నాం. గాడి తప్పిన మన జీవినశైలి, అదుపు తప్పిన ఆహారపు అలవాట్ల మరియు వత్తిడి కారణంగా డయాబెటీస్,హై బీపీ (రక్తపోటు), గుండె జబ్బులు, ఊబకాయం వంటి అనేక జబ్బుల బారిన పడుతున్నాం.ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుతారు.హెల్తీ గా ఉండాలంటే తప్పనిసరిగా కొన్నిరకాల జాగ్రత్తలు పాటించాలి. ఆధునిక జీవన శైలిలో సౌకర్యాలతో పాటు సమస్యలను కూడా పెంచుకుంటున్నాం.  ఆహారపు అలవాట్లు, కూర్చున్న చోటే అన్ని పనులు జరగడం, చాలీ చాలని నిద్ర వీటన్నింటి కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నాం. ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’  సందర్భంగా మన జీవన శైలిలో మార్పులు? వాటి వల్ల వస్తున్న సమస్యలు, నివారణ చర్యలేంటో ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.  తెల్లవారుజామునే నిద్రలేవడం, రాత్రి త్వరగా పడుకోవడం, ప్రకృతిని ఆస్వాదిస్తూ రోజంతా ఒళ్లు వంచి పనులు చేసుకోవటం. అంతే కాకుండా సహజసిద్ధంగా పండే కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలను తినడం. ఆరుబయట గాలిని పీలుస్తుండటం, స్వచ్ఛమైన నీటిని తాగుతూ ప్రశాంతంగా బతకడం. ఇది ఒకప్పటి జీవన శైలి. కానీ ఇప్పుడలా కాదు, కూర్చున్న చోటే అన్ని పనులు అవుతున్నాయి. సహజ సిద్ధమైన ఆహారాలు, సంప్రదాయక వంటలు పూర్తిగా కనుమురుగు అయిపోయాయి. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్​కు నేటి సమాజం బాగా అలవాటు పడిపోతుంది.అంతే కాదు సమయానికి తినడం దాదాపు మర్చిపోయామనే చెప్పొచ్చు. వేళా పాళా అనేది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినేస్తున్నాం మరియు AC, సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల వాడకం ఒక్క క్లిక్‌తో సుఖంగా ఉండటానికి దారితీస్తుంది. కానీ నిశ్చల జీవితం, వ్యాయామం లేకపోవడం, మానసిక అలసట, ఒత్తిడి మరియు ఆందోళన రూపంలో మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తోంది. రవాణా కోసం వాహనాలను మాత్రమే ఉపయోగించడం మరియు శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చోవడం గుండె జబ్బులు మరియు మెదడు స్ట్రోక్‌లకు  దారితీస్తోంది.ఇప్పుడు చాలా మంది ఇంటర్నెట్ నుండి సూచనలు తీసుకోవడం అనేది ట్రెండింగ్‌లో ఉంది దీని వల్ల స్వయంగా డాక్టర్స్ ని సంప్రదించకుండా వారే మెడిసిన్స్ వాడటం ప్రమాదకరంగా మారే విషయం, తరువాతి దశలో ప్రాణాంతకం కావచ్చు. కొన్ని ప్రదేశాలలో క్వాక్ కల్చర్ కొన్ని సందర్భాలలో మరింత హానికరం. గాడి తప్పిన మన జీవినశైలి, అదుపు తప్పిన ఆహారపు అలవాట్ల మరియు వత్తిడి కారణంగా డయాబెటీస్,హై బీపీ (రక్తపోటు), గుండె జబ్బులు, ఊబకాయం వంటి అనేక జబ్బుల బారిన పడుతున్నాం. మరియు AC, సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల వాడకం ఒక్క క్లిక్‌తో సుఖంగా ఉండటానికి దారితీస్తుంది. కానీ నిశ్చల జీవితం, వ్యాయామం లేకపోవడం, మానసిక అలసట, ఒత్తిడి మరియు ఆందోళన రూపంలో మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తోంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్,  డాక్టర్ అజయ్ పాటిల్, డాక్టర్ దత్తు రాజు, డాక్టర్ యజ్ఞా అసిస్టెంట్ మెడికల్ సూపర్ ఇండెంట్, సెంటర్ హెడ్ స్వామి మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ పాల్గొన్నారు.

To stay healthy, you need to take precautions.

More articles

Latest article