24 C
Hyderabad
Sunday, August 2, 2026

బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: భారతీయ జనతా పార్టీ 46 వ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా ఏర్గట్ల మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని బిజెపి మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏలేటి నారాయణరెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రంలో బిజెపి జండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు అన్ని గ్రామాలలో బిజెపి పార్టీ జెండాని ఎగరవేయడం జరిగిందని తెలిపారు.  ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర అవస్థలకు లోనవుతున్నారని, రానున్న లోకల్ ఎలక్షన్స్ లో  బిజెపి పార్టీ నీ ప్రజలు గెలిపించి తీరుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు ఘనశ్యాం, గంగేశ్వర్, వంశీ, కూరాకుల భూమేష్, శ్రీను, ప్రసాద్, విట్టల్, బిజెపి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article