బతుకమ్మ,మోర్తాడ్ : శ్రీ రామనవమి పురస్కరించుకొని మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఆదివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి హనుమాన్ మందిరం వరకు హనుమాన్ స్వాములు సీతారాముల పల్లకి సేవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా పల్లకిలో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు సీతారాములోనికి హారతులతో స్వాగతం పలికారు. భక్తులు ఆనందంతో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సంతోషంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

