25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఆరోటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం కేసులో శుక్రవారం ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ సౌత్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.సురేష్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆరవ టౌ న్ పరిధిలోని అక్బర్ కాలనీ (కెనాల్ కట్ట) లో సయ్యద్ పా ష అతని కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతనికి  ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరు కూతుర్లు కూడా  అతని ఇంటి పక్కనే అక్బర్ కాలనీలో నివసిస్తూ ఉంటారు. సయ్యద్ పా ష  అతని కుమార్తె బిడ్డ (మనవరాలు)  ఉస్మా తో వాళ్ళ ఇంటి పక్కన నివసిస్తున్నసోయల్ ఖాన్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఈనెల 2న సోహెల్ వాళ్ళ ఇంటికి సయ్యద్ పా ష, అతని భార్య రజియా వెళ్లి అడిగారు. సోహెల్ వాళ్ళ తల్లి రెహనా బేగం, చెల్లెలు సుహానా బేగం ఇద్దరు కలిసి సయ్యద్ పా ష ను,  భార్య రజియను కొట్టారు.  తిరిగి సాయంత్రం జరిగిన గొడవను మనసులో పెట్టుకొని  ఆరిఫ్ ఖాన్, అతని భార్య రెహనా బేగం, కూతురు సుహానా బేగం,కొడుకు  సోహెల్ ఖాన్, బామ్మర్ది షేక్ పర్వేజ్ వీరందరూ కలిసి సయ్యద్ పాషా వాళ్ళ ఇంటి మీద దాడి చేసి సయ్యద్ పా ష అల్లుడైనటువంటి షేక్ గౌస్ ని ఆరిఫ్ ఖాన్ తన వెంట ఇంట్లో నుంచి తీసుకొచ్చిన కత్తితో తో పొడిచాడు. సోహెల్, పర్వేజ్,రెహనా బేగం, సుహానా బేగం కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో షేక్ గౌస్ తో పాటు పరానా బేగం ,సయ్యద్ ఫయాజ్ లకు కూడా గాయాలయ్యాయి. సయ్యద్ పా ష ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులు ఆరిఫ్ ఖాన్, సోయల్ ఖాన్, షేక్ పర్వేజ్ లను పట్టుకొని అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్ కు పంపించారు.

More articles

Latest article