కేంద్ర గృహనిర్మాణ,  పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శిని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే

0 12,495

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఢిల్లీ నిర్మాణ్ భవన్ లోని కేంద్ర గృహనిర్మాణ,  పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి కటికితల శ్రీనివాస్ ను ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎంపీ  అరవింద్  ధర్మపురి సమక్షంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందూర్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నగర సుందరికరణ, రోడ్స్, పార్క్స్ వంటి నిర్మాణాల అంశాలను చర్చించినట్లు తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రధానకార్యదర్శి కటికితల శ్రీనివాస్ ఇందూర్ జిల్లా అభివృద్ధికి కావలిసిన సహాయాసహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని తెలిపారు. ఇందూర్ అర్బన్ నియోజకవర్గన్ని స్మార్ట్ సిటీ మాదిరిగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా పని చేయడం జరుగుతుందని  ఎంపీ అరవింద్ ధర్మపురి సహకారంతో ఇందూర్ అర్బన్ అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు వచ్చేల కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మొరెపల్లి సత్యనారాయణ, జ్యోతి,  లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.