29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏపీలో తొలి బర్డ్ ప్లూ మరణం.. రంగంలోకి కేంద్రం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ప్లూ మరణం  కలకలం రేపుతోంది. రాష్ట్రంలో బర్డ్ ప్లూతో తొలి మరణం చోటుచేసుకోవడంతో  కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. నరసరావుపేటకు చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్ ప్లూతో మృతి చెందింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. డిల్లీ న్సీబీకి చెందిన ముగ్గరు సభ్యులతో పాటు ముంబైకి చెందిన మరొక డాక్టర్, మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్ తో కలిపి ఒక బృందంగా ఏర్పడి అధ్యయనం ప్రారంభించారు. నరసరావుపేటకు వెళ్లి కుటుంబసభ్యులతో కేంద్ర బృందం సభ్యులు మాట్లాడారు. ఏం జరిగిందో వివరాలు తెలుసుకున్నారు.  చికెన్ షాపుకు వెళ్లి శాంపిల్స్ సేకరించారు. కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించి పూర్తి స్థాయి సమాచారం సేకరించారు.

More articles

Latest article