ఒలింపియాడ్ లో మహాస్విన్ ప్రతిభ

0 2,656

. ల్యాప్ టాప్ గెలుచుకున్న శ్రీచైతన్య నాల్గో తరగతి విద్యార్థి
ఆర్మూర్ టౌన్,  బతుకమ్మ : ఐఎన్ టీఎస్ వో ఒలింపియాడ్ ఎగ్జామ్ లో ఆర్మూర్ పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాల విద్యార్థి మహాస్విన్ ఉత్తిమ ప్రతిభకనబర్చి ల్యాప్ టాప్ గెలిచుకున్నాడు. నాల్గో తరగతి చదువుతున్న మహాస్విన్ జాతీయ స్థాయిలో రెండు దశల్లో జరిగే ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ ఎగ్జామ్ చివరి దశలో అద్బుత ప్రతిభను కనబర్చాడు. అలాగే 207 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యి ప్రత్యేక బహుమతులు, బంగారు పతకాలను గెలుపొందారు. 11 మంది ట్యాబ్ స్మార్ట్ వాచెస్, ఇతర బహుమతులు గెలుపొందారు. 133 మంది బంగారు పతకాలు గెలుపొందారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ముత్తు నందిపాటి మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఆర్మూర్ పేరు నిలబెట్టిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో ఏ జీ ఏం సతీశ్ రెడ్డి, కో ఆర్డినేటర్ మహిపాల్ రెడ్డిప్రసన్నడీన్ రాకేష్సి ఇన్చార్జి రాజేశ్వర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.