25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: ఏప్రిల్ 5 న నారాయణపేటలో జరిగే, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయితీ వర్కర్స్ యూనియన్ (TUCI అనుబంధం) రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ మోర్తాడ్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించి,  కరపత్రాలు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్  నిజామాబాద్ రూలర్  కామారెడ్డి సంయుక్త జిల్లాల  నాయకులు జి.కిషన్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (TUCI అనుబంధం),  గ్రామపంచాయతీ కార్మికులకు అండగా నిలిచి, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. మండల, పంచాయితీ కార్మికుల పక్షాన న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమించిందని, ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5న నారాయణపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర రెండవ మహాసభలు నిర్వహించి, గత పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోబోతుందని అన్నారు. కార్యక్రమంలో  గ్రామ పంచాయితీ వర్కర్స్,,నర్సయ్య, రాజేశ్వర్, బజాన్న, గoగాదర్, దెఓల్ల గoగాదర్, చిన్నక్క, సువర్ణ, లతా, మమిడి. గoగుబాయీ, దశరద్, మజీద్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article