25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బర్డ్ ఫ్లూ తో చిన్నారి మృతి

Must read

📰 Generate e-Paper Clip

నరసరావుపేట, బతుకమ్మ: బర్డ్ ఫ్లూ కారణంగా రెండేళ్ల చిన్నారి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని నరసరావుపేటలో మృతి చెందింది. చిన్నారి బర్డ్ ఫ్లూ కారణంగానే మరణించినట్లు ఐసీఎంఆర్ నిర్దారించింది. పచ్చి కోడి మాంసం తినడంతోపాటు రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండడంతో తీవ్ర అస్వస్తతకు గురికావడంతో చిన్నారిని గత నెల 16న మంగళగిరి ఎయిమ్స్ లో చేర్చారు. చికిత్స పొందుతూ చిన్నారి  మృతి చెందడంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిన్నారి ఇంటి సమీపంలో సర్వే నిర్వహించారు. బర్డ్ ఫ్లూ లక్షణాలు ఇతరుల్లో ఉన్నాయా? అని ఆరా తీశారు.

More articles

Latest article