25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సెక్యూర్ హాస్పిటల్ ను ప్రారంభించిన పోచారం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :   సెక్యూర్ చైల్డ్ కేర్ ఆస్పత్రిని నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఖలీల్ వాడిలో సెక్యూర్ చైల్డ్ కేర్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పీడియాట్రిక్ విభాగంలో చిన్న పిల్లలకు సేవలందించేందుకు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.  అనంతరం ఆస్పత్రి ఎండీ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్,(పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ ఫెలోషిప్ బి ఎల్ కే మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ, న్యూఢిల్లీ) వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ..డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు, పిట్స్, పచ్చకామెర్లకి చికిత్స,ఆధునాతన గుండె, బి.పి. పర్యవేక్షణ చికిత్సలు అందిస్తున్నామన్నారు. నవజాత శిశువు వార్మర్, ఫోటో థెరపి లు  చికిత్సలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బీన్ హందన్, నుడా చైర్మన్ కేశవ వేణు, తానా అధ్యక్షులు డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ మోతిలాల్, డిఎన్బి రేడియాలజిస్ట్ విద్యా శ్రీ, మీరాబాయి వెంకట రాములు, డాక్టర్ శ్రీధర్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article