సెక్యూర్ హాస్పిటల్ ను ప్రారంభించిన పోచారం

నిజామాబాద్, బతుకమ్మ :   సెక్యూర్ చైల్డ్ కేర్ ఆస్పత్రిని నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఖలీల్ వాడిలో సెక్యూర్ చైల్డ్ కేర్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పీడియాట్రిక్ విభాగంలో చిన్న పిల్లలకు సేవలందించేందుకు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.  అనంతరం ఆస్పత్రి ఎండీ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్,(పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ ఫెలోషిప్ బి ఎల్ కే మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ, న్యూఢిల్లీ) వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్...