నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని బైపాస్ రోడ్ లో ఆర్ ఎం ఎంటర్ టైన్ మెంట్ మినీ థియేటర్ డాల్బీ ఆటోమ్స్ ను ఆదివారం నుడా చైర్మన్ కేశ వేణు ప్రారంభించారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ.. యువత మంచి ఆలోచనలతో డబ్బు సంపాదించే మార్గాన్ని వివిధ రంగాల ద్వారా ఉపయోగించుకోవచ్చన్నారు. ప్రవేట్ హోమ్ థియేటర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా యజమానులు రవి, చరణ్ లు ప్రారంభించడం గర్వకారణమన్నారు. తక్కువ ధరలలో అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచామని, ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని యాజమానులు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బట్టు రాజేష్, గోపరి లక్ష్మణ్, పార్థసారథి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆర్ ఎం ఎంటర్టైన్మెంట్స్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

