28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అమ్మాయిలకు అండగా షీ టీం

Must read

📰 Generate e-Paper Clip

  • ఎస్ ఐ హరిబాబు

బతుకమ్మ, నందిపేట్ : అమ్మాయిలకు అండగా వుంటూ షీ టీం ఎందరో అకయితలా ఆగడలను అరికట్టిందని నందిపేట్ ఎస్ ఐ హరిబాబు పేర్కొన్నారు. నందిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో గురువారం జరిగిన షీ టీం అవగాహన కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఎస్ ఐ ప్రశాంగించారు. విద్యార్థినిల,యువతుల, ఉద్యోగినిల, మహిళలపట్ల ఎవరైనా పోకిరిలు అసభ్యకరంగా ప్రవర్తించిన ,ఈవ్‌టీజింగ్‌-వేధింపులకు గురి చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలని కోరారు. మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించి కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి యువకులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటుంది కాబట్టి ఈవ్‌ టీజింగ్‌కు గురయ్యేవారు భయపడకుండా 8712659795 కు, డయల్‌ 100కు సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామన్నారు. విధ్యార్తినిలు , మహిళలు, యువతిలు మానసికంగా ఆత్మస్థైర్యంతో దృఢంగా ఉండాలని సూచించారు . ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది , సబ్ డివిజన్ షీ టీం కానిస్టేబుళ్లు, కళాశాల అధ్యాపక బృందం విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

She is a team for girls

More articles

Latest article